జులకల్ మోడల్ స్కూల్ విద్యార్థుల రవాణా సౌకర్యం కోసం ప్రత్యేక RTC బస్సు ఏర్పాటు చేయమని కర్నూల్ డిపో -2 మేనేజరికి వినతి పత్రం అందజేసిన బీజేపీ మండలాధ్యక్షుడు పొన్నకల్ వెంకటేష్
9వ్యూస్, గూడూరు మండలం,(జూలకల్) జులై05: కర్నూలు జిల్లా గూడూరు మండలం జులకల్ మోడల్ స్కూల్ విద్యార్థుల రవాణా సౌకర్యం కోసం ప్రత్యేక RTC బస్సు ఏర్పాటు చేయమని కర్నూల్ డిపో -2 మేనేజరికి వినతి పత్రం అందజేసిన బీజేపీ మండలాధ్యక్షుడు పొన్నకల్ వెంకటేష్.
జులకల్ మోడల్ స్కూల్ నూతనంగా ఈ విద్యా సంవత్సరం నుండి బడి వేళలు మార్పు చేయబడిన కారణంగా విద్యార్థులకు — ముఖ్యంగా బాలికలకు — స్కూల్ ఐపోయిన తరువాత ఇంటికి చేరుకోవడంలో తీవ్రమైన రవాణా సమస్యలు ఎదురవుతున్నాయి. ఆటో రిక్షాలలో అధిక సంఖ్యలో ప్రయాణించడం వల్ల ప్రమాదాల కారణంగా విద్యార్థుల భద్రత తీవ్రంగా ప్రభావితమవుతోంది.
ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని, జులకల్ మోడల్ స్కూల్ సమీపంలో స్కూల్ ముగిసే సమయానికి సాయంత్రం 5:00 గంటలకు అనుగుణంగా ప్రత్యేక RTC బస్సు సౌకర్యం ఏర్పాటు చేయవలసిందిగా అసెంబ్లీ కో కన్వీనర్ వేల్పుల గోపాల్ కోరారు.
కారణాంతరాలు లేకుండా తక్షణమే తాత్కాలికంగా అయినా ఒక బస్సు సౌకర్యాన్ని ప్రారంభించి, విద్యార్థుల ప్రయాణ సౌకర్యాన్ని మెరుగుపరచవలసిందిగా జిల్లా ప్రధాన కార్యదర్శి కోటియాదవ్ కోరారు.