డెంగీ నియంత్రణ మన చేతుల్లోనే ఉంది
9వ్యూస్, అన్నమయ్య జిల్లా, వాయల్పాడు, జులై 05:అతిసారా వ్యాధి మరియు డెంగీ జ్వరాల నియంత్రణ మన చేతుల్లోనే ఉంది అని డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ అన్నారు.
శనివారం వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం లో భాగంగా ఎర్రగుంట్ల బావి గ్రామం లో డెంగీ వ్యతిరేక మాసం మరియు స్టాప్ డయేరియా కార్యక్రమాలు డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ నిర్వహించడం జరిగింది.
చేతుల శుభ్రత లోని దశలు మరియు ఓ. ఆర్. ఎస్ ద్రావణం తయారు చేసుకోవడం చేసి చూపించారు. పరిసరాలు పరిశుభ్రత ఆరోగ్యానికి భద్రత అని తెలిపారు. కిటికీలకు మెష్ కొట్టించుకోవాలని, పచ్చివేపాకు రోజు సాయంత్రం ఇళ్లలో పొగ వేసుకోవాలని, ఫ్రైడే డ్రై డే పాటించాలని తెలిపారు.
అనంతరం ర్యాలీ నిర్వహించి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం లో సి. హెచ్. ఓ. సౌజన్య, ఏ. ఎన్. ఎమ్. నిర్మల, మగ ఆరోగ్య కార్యకర్త వలి, ఆశా కార్యకర్తలు, టీచర్ వెంకటమ్మ, అంగన్వాడీ కార్యకర్త హేమలత తదితరులు పాల్గొన్నారు.