శ్రీ సంతోషిమాత దేవాలయంలో తొలి ఏకాదశి పూజలు

శ్రీ సంతోషిమాత దేవాలయంలో తొలి ఏకాదశి పూజలు


9వ్యూస్,సూర్యాపేట సాంస్కృతికం, జులై 06: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోషి మాత దేవాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా దేవాలయంలో వేంచేసి ఉన్న శ్రీ సత్య సాంబశివ స్వామివారికి దేవాలయ అర్చకులు బట్టారం వంశీకృష్ణ శర్మ ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు.


 ఈ సందర్భంగా భక్తులు స్వయంగా స్వామివారి గర్భగుడిలోకి ప్రవేశించి వారి స్వహస్తాలతో అభిషేకములు చేసుకునే విధంగా భక్తులకు ఏర్పాట్లు చేశారు. 



తొలి ఏకాదశిని పురస్కరించుకొని తెల్లవారుజాము నుండి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు. 


ఈ కార్యక్రమంలో శ్రీ సంతోషి మాత దేవాలయం అధ్యక్షులు నూక వెంకటేశం గుప్త ప్రధాన కార్యదర్శి బ్రాహ్మ0డ్లపల్లి మురళీధర్, కోశాధికారి పాలవరపు రామమూర్తి, దేవరశెట్టి సోమయ్య ,బజ్జూరి శ్రీనివాస్, మహంకాళి ఉపేందర్, దేవాలయం మేనేజర్ బచ్చు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.