కక్కిరేణి వెంకటేశ్వర్లు దశదిన కార్యక్రమంలో పాల్గొన్న ఇమ్మడి సోమనరసయ్య
జిల్లా కాంగ్రెస్ నాయకులు, మాజీ కౌన్సిలర్, కాంగ్రెస్ మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్, జిల్లా ఆర్యవైశ్య మహాసభ పొలిటికల్ చైర్మన్ కక్కిరేణి శ్రీనివాస్ తండ్రి కక్కిరేణి వెంకటేశ్వర్లు దశదిన కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పబ్లిక్ క్లబ్ లో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి ఇమ్మడి సోమ నరసయ్య పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
వీరి వెంట జిల్లా ఆర్యవైశ్య మహాసభ యువజన విభాగం మాజీ అధ్యక్షులు మీలా వంశీ, జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు బచ్చు పురుషోత్తం, జిల్లా ఆర్యవైశ్య మహాసభ సహాయ కార్యదర్శి కక్కిరేణి ప్రసాద్ తదితరులు ఉన్నారు.