మాజీ మంత్రి జోగు రామన్నకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్
9వ్యూస్, ఆదిలాబాద్ జిల్లా, జులై04: మాజీ మంత్రి, ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జోగు రామన్న జన్మదిన సందర్భంగా ఆదిలాబాద్ పట్టణంలోని STU భవన్లో నిర్వహించిన జన్మదిన వేడుకలకు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ బోథ్ నియోజకవర్గ నాయకులతో కలిసి భారీ కాన్వాయ్ తో హాజరయ్యారు.
ఈ సందర్భంగా జోగు రామన్నకి ఘనంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో రక్తదానం చేసిన అభిమానులకు ఎమ్మెల్యే అనిల్ జాధవ్ సర్టిఫికేట్లను అందజేశారు.
జోగు రామన్న ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ప్రజా సేవలో నిమగ్నమవ్వాలని కోరుకున్నారు. రానున్న స్థానిక సంస్థలు మనవేనని ఆదిలాబాద్ జిల్లా నుంచి కేసీఆర్ కి కానుకగా స్థానిక సంస్థల నాయకత్వాన్ని అందిద్దామని అన్నారు.
వీరి వెంట బోథ్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.