అపర చాణక్యుడు కొణిజేటి రోశయ్య
వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్
9వ్యూస్, సూర్యాపేట, జులై 04: దివంగత మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ,అందరివాడని రాజకీయాలలో అపరచాణక్యుడని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏకైక మంత్రిగా పేరు సంపాదించారని సూర్యాపేట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు గట్టు శ్రీనివాస్ గుప్త అన్నారు. మాజీ ముఖ్యమంత్రి ఆర్యవైశ్య నాయకులు రోశయ్య జయంతి సందర్భంగా సూర్యాపేట పట్టణంలోని టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రోశయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గట్టు శ్రీనివాస్ మాట్లాడుతూ కొణిజేటి రోశయ్య రాజకీయాలలో విలువలు పాటించిన నాయకుడని, ఆయన 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారని అటువంటి ఘనత మరే నాయకునికి దక్కలేదని అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోశయ్య జయంతి ని అధికారికంగా నిర్వహించాలని ఆదేశాలు జారి చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ఆదేశాల మేరకు సూర్యాపేటలో జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ లు వెలుగు వెంకన్న, జ్యోతి కరుణాకర్, పిల్లల రమేష్ నాయుడు, వీర మల్లు, బైరబోయిన శ్రీనివాస్, వల్దాసు దేవేందర్, యాట వెంకన్న, అంగిడి ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు....