తిరుమలగిరి మండల చేనేత కార్మిక సంఘం ఆద్వర్యం లో కృతజ్ఞత కార్యక్రమం

 తిరుమలగిరి మండల చేనేత కార్మిక సంఘం ఆద్వర్యం లో కృతజ్ఞత కార్యక్రమం



9వ్యూస్, తిరుమలగిరి, జులై 04; తెలంగాణ లోని చేనేత ఆధారిత వృత్తి దారులకు లక్ష రూపాయల లోపు చేనేత ఋణ మాఫీ చేస్తూ పరిపాలన అనుమతులు ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి, చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి, స్థానిక ఎమ్మెల్యే మందల సామేల్ కి, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కమర్తపు మురళికి తిరుమలగిరి మండల చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యం లో చేనేత సహకార సంఘము నందు కృతజ్ఞత కార్యక్రమం నిర్వహించారు.


పద్మశాలి పులి బిడ్డ, యువకిషోరం ఉత్సాహవంతుడు, ఎవరికి ఏ ఆపద వచ్చినా ముందుండి నేనున్నా అని ఆదుకొనే నాయకుడు మంత్రి తుమ్మలకు ముఖ్య అనుచరుడు,తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కమర్తపు మురళి మన జాతి కోసం మన పద్మశాలి సమాజం కోసం చేనేత కార్మికుల కోసం కొట్లాడి 33 కోట్ల రూపాయలను ఇప్పించినందుకు పద్మశాలి,చేనేత సమాజం తరఫున అభినందనలు ధన్యవాదములు తెలియజేశారు.అదేవిధముగా మాలిపురం గ్రామానికి చెందిన చేనేత కార్మికుడు వంగరి సత్యనారాయణ ఇటీవల అకాల మరణం చెందటం తో వారి కుటుంబాన్ని ఆదుకోవటం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన నేతన్న భీమా పథకం వచ్చుట కొరకు సహాయ సహకారాలు అందించిన రాష్ట్ర ప్రభుత్వానికి ,కమర్తపు మురళీకి బాధిత కుటుంబం ధన్యవాదాలు తెలిపారు.భీమా పథకం అనుమతి మంజూరి పత్రం నాయకుల సమక్షంలో నామినికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో పలువురు మండల పద్మశాలి సంఘం నాయకులు మాట్లాడుతూ అందరూ ఐక్యతతో ఉండి ప్రభుత్వం కల్పించిన పథకాలు సద్వినియోగం చేసుకోవడమే కాకుండా రానున్న స్థానిక ఎన్నికలలో పెద్ద ఎత్తున పద్మశాలియులు పోటీ చేసి విజయం సాధించే విధముగా ఒకరికి ఒకరు సహకరించుకోవాలని అభిప్రాయ పడ్డారు. 


ఈ కార్యక్రమం లో బి సి సంక్షేమ సంఘం సూర్యాపేట జిల్లా కార్యదర్శి,చేనేత సంఘం నాయకులు వంగరి బ్రహ్మం.పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు చింతకింది మురళీ,మాలిపురం పద్మశాలి సంఘం అధ్యక్షులు మద్దూరి శంకరయ్య,జిల్లా,మండల, గ్రామ నాయకులు చింతకింది సోమనారాయణ,మద్దూరి రాములు,ఎలె అంజయ్య గజ్జెల ఉపేందర్,మూడ వెంకన్న, వంగరి సూర్యనారాయణ, వంగరి ఉపేందర్, వంగరి సోమయ్య,వంగరి సోమకృష్ణ,వీరబత్తిని మల్లయ్య, మెతుకు ఉపేందర్,అక్కల ఉప్పలయ్య, వంగరి రమేష్,మద్దూరి ఉమేష్, ఏనగందుల రవి,మంచే అంబాదాస్, వెంగలి పాండయ్య, వీరబత్తిని మురళీ,అమృతం రాజు, వంగరి రాములు, దుస్స సత్యనారాయణ, వెంగలి మదు,మద్దూరి గోవర్దన్, వంగరి కిషన్,కొక్కుల సోమనర్సయ్య, కోట రాములు,కోట సిద్ది రాములు, వంగరి కోటయ్య,పొట్టబత్తుల శంబయ్య, మూడ నాగరాజు,మిర్యాల శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.