కొట్టాల పోచమ్మ బోనాల జాతర పోస్టర్లను ఆవిష్కరించిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్
9వ్యూస్, ఆదిలాబాద్ జిల్లా, బోథ్, జులై 06: బోథ్ మండల కేంద్రంలో ఈనెల 13వ తేదీన ఉదయం 10 గంటలకు జరిగే శ్రీ కొట్టాల పోచమ్మ బోనాల జాతర పోస్టర్లను ఈరోజు నెరడిగొండ మండల కేంద్రంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కొట్టాల బోనాల జాతరకు ముఖ్యఅతిథిగా హాజరు కావాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ గారిని ఆహ్వానించిన శ్రీ కొట్టాల పోచమ్మ ఆలయ కమిటీ సభ్యులు మరియు బోథ్ పట్టణ ప్రజలు.
ఈ సందర్భంగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ మాట్లాడుతూ మన నియోజకవర్గంలో కూడా కొట్టాల పోచమ్మ బోనాల జాతర ప్రారంభించడం మంచి ఆలోచన అని అన్నారు.