సిరికొండలో ఘనంగా తొలిఏకాదశి పూజలు
9వ్యూస్, మోతే మండలం, జులై 06: సూర్యాపేట జిల్లా మోతే మండలంలోని సిరికొండ గ్రామం లో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయం నందు ఆదివారం ఘనంగా తొలి ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి..
అర్చకుడు నరసింహ ఆచార్యులు ఉదయం సాలగ్రామ అభిషేకం, విష్ణు సహస్ర నామ పారాయణం, లక్ష్మీ సహస్ర నామ పారాయణం,తదుపరి సుగంధ పుష్పాలతో అష్టోత్తర శతనామావళి నిర్వహించి అనంతరం పేల పిండి ప్రసాదం నివేదన చేయటం జరిగింది..
భక్తుల కోలాహలం నడుమ తొలి ఏకాదశి పూజలు వైభవంగా జరిగాయి. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించి వేద ఆశీర్వచనం చేశారు..
ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు గోపాల్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, సురేష్ రెడ్డి, శ్రీపాల్ రెడ్డి, మట్టి నితిన్ మంచాల శ్రీనివాస్, శ్రీలక్మి ,స్వప్న వీర రెడ్డి, యాత వెంకన్న మరియు తదితర భక్తులు పాల్గొన్నారు..