సుపరిపాలనలో తొలిఅడుగు డోర్ టు డోర్

 సుపరిపాలనలో తొలిఅడుగు డోర్ టు డోర్


ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం, జూలై 4, (9వ్యూస్):ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీ ఖిల్లా రోడ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం ...



మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ సూచన మేరకు కూటమీప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఇప్పటివరకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కార్యక్రమాలు అలాగే సాధించిన విజయాలు అలాగే ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాలు గురించి తెలియజేసే సుపరిపాలనలో తొలిఅడుగు డోర్ టు డోర్ కార్యక్రమంలో కొండపల్లి మున్సిపాలిటీ 28వ వార్డు 164 బూత్ ఖిల్లా రోడ్డు నందు చేపట్టడం జరిగింది.



ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ పార్టీ అధ్యక్షులు చుట్టుకుదురు శ్రీనివాసరావు జిల్లా మైనార్టీ ఉపాధ్యక్షులు ఎండి అఫ్సర్ బూత్ కన్వీనర్ సయ్యద్ ఫరహాన్ విజయవాడ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బసవ ఉమా మహేశ్వర రావు నాయకులు కుమ్మరి శ్రీనివాసరావు మాజీ వార్డ్ సభ్యులు షేక్ ఖాజా కోట సురేష్ 26వ వార్డ్ అధ్యక్షులు కోట్ల రాజు,స్థానిక నాయకులు కాకి లక్ష్మణరావు రాగా జమలయ్య పాలపర్తి నాగేశ్వరరావు కోనేరు కొండలు తదితరులు పాల్గొనడం జరిగింది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.