గొల్లపూడిలోని పంపింగ్ స్కీంను సందర్శించిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు
ఎన్టీఆర్ జిల్లా, గొల్లపూడి, జూలై 4, (9వ్యూస్ : విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని పంపింగ్ స్కీంను సందర్శించిన మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు రైతులతో కలిసి కాలువ శుద్ధి కార్యక్రమంలో పాల్గొని తూడుకాడ వ్యర్థాలను తొలగించడం జరిగింది.కాలువలో పేరుకుపోయిన తూడుకాడ వ్యర్థాల వల్ల నీటి ప్రవాహం అడ్డంకులకు గురవుతోంది.ఇది చివరి ప్రాంతాల్లోని రైతులకు నీరు అందకుండా చేస్తోంది.
మనం స్వయంగా శ్రమదానం చేసి కాలువను శుభ్రం చేసి నీటిని అన్ని ప్రాంతాలకు సమర్థవంతంగా చేరేలా చేయాలి రైతులు మన అన్నదాతలు.వారి సమస్యలను పరిష్కరించడం మన బాధ్యత.తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ రైతుల పక్షాన నిలుస్తుంది కాలువల శుద్ధి కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా చేపట్టాలి.నీటి సరఫరా సమస్యలు తలెత్తకుండా చూడడానికి నిరంతర పర్యవేక్షణ అవసరం అని దేవినేని సూచించారు.