ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రుల సభను విజయవంతం చేయండి.. ఎమ్మెల్యే డా మురళీ నాయక్
9వ్యూస్, మహబూబాబాద్ , జులై 06: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై పార్టీ కార్యకర్తలు, నాయకులు గ్రామాల్లో ప్రజలకు విస్తృత స్థాయిలో ప్రచారం చేయాలని మహబూబాబాద్ ఎమ్మెల్యే డా మురళీ నాయక్ తెలిపారు.
ఈ రోజు గూడూరు మండలం కేంద్రంలో పార్టీ కార్యాలయంలో సంస్థాగత ఎన్నికల సందర్భంగా ఆదివారం మండల స్థాయి ముఖ్య నాయకులు, గ్రామ స్థాయి,కార్యకర్తల సన్నాహక సమావేశంలో పాల్గొన్న గౌరవ మహబూబాబాద్ శాసనసభ్యులు డా భూక్యా మురళీ నాయక్
ఈ నెల 08వ తేదీన కేసముద్రం మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు,ధనసరి సీతక్క,కొండ సురేఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొనీ భారీ బహిరంగ సభలో పాల్గొంటారు
కేసముద్రం మండల మరియు మున్సిపాలిటీ పరిధిలో 300 కోట్ల అభివృద్ధి పనులు శంకుస్థాపనలు చేసున్నారని తెలిపారు కావున గూడూరు మండలం నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు అభిమానులు తరలి వచ్చి సభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పని చేయాలి
గ్రామాల్లోని ప్రజలు ఇది కదా మేము కోరుకున్న ఇందిరమ్మ రాజ్యమని సంతోషపడుతున్నారు అని అన్నారు .మనం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను రాష్ట్రంలో ప్రతీ గడపకు తీసుకువెళ్లాలి.పది సంవత్సరాలుగా పేద ప్రజలు ఎదురు చూసిన అనేక కార్యక్రమాలను ఇందిరమ్మ రాజ్యంలో అమలు చేస్తున్నాం.నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, సన్న బియ్యం వంటి సంక్షేమ పథకాలు ప్రజలకు అందజేస్తున్నాం.
బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ సంక్షేమ పథకాలను అమలు చేస్తలేదంటూ దుష్ప్రచారం చేస్తున్నారనీ మండిపడ్డారు. గ్రామాలలో ఉండే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బి ఆర్ ఎస్ పార్టీ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రతి ఇంటికి, గడపకి వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న పథకాలను ప్రజలకు వివరించాలని కోరారు.
గ్రామాలలో ఉన్న నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పథకాలపై నోరు విప్పకుంటే మీకే నష్టం జరుగుతుందన్నారు. ఎన్నికల ఎప్పుడూ వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పథకాలతో ధైర్యంగా వెళ్ళి ఓటు అడగాలిని అప్పుడే గెలుస్తారన్నారు.
నేటి సమావేశ సందేశాన్ని ప్రతి ఒక్కరు ప్రజలకు చేరవేయాలి.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, మండల నాయకులు, గ్రామ నాయకులు, పట్టణ నాయకులు,మాజీ ప్రజా ప్రతినిధులు, డైరెక్టర్లు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు