శ్రీ పాండురంగ దిండి నగర ప్రదక్షణ శోభయాత్రలో పాల్గొన్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్
9వ్యూస్, గుడిహత్నూర్ మండలం, జులై 06: తొలి ఏకాదశి (ఆషాడ ఏకాదశి) పార్వదినాన్ని పురస్కరించుకొని గుడిహత్నూర్ మండల PACS చైర్మన్ సంజీవ్ ముండే కుటుంభం ప్రతి ఏటా ఎంతో భక్తి శ్రద్దాలతో నిర్వహించే శ్రీ పాండురంగ దీండి నగర ప్రదక్షణ శోభయంత్రలో పాల్గొని వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసిన బోథ్ శాసనసభ్యులు అనిల్ జాదవ్.
ఈ సందర్బంగా అత్యంత ప్రశస్థమైన తొలి ఏకాదశి పండగను గుడిహత్నూర్ మండల ప్రజలు నూతన ఉత్సాహంతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ తొలి ఏకాదశి పండగ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మండల BRS పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.