వెయ్యి స్తంభాల దేవస్థానంలో తొలి ఏకాదశి పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే నాయిని దంపతులు

 వెయ్యి స్తంభాల దేవస్థానంలో తొలి ఏకాదశి పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే నాయిని దంపతులు


9వ్యూస్, వెయ్యిస్థంభాల గుడి, హనుమకొండ జిల్లా, జులై 06: ఈ రోజు పవిత్ర తొలి ఏకాదశి సందర్భంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి వారి సతీమణి నాయిని నీలిమ రెడ్డితో కలిసి హనుమకొండలోని ప్రసిద్ధ వెయ్యిస్థంభాల ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.



ఈ సందర్భంగా ఎమ్మెల్యే నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సంపదతో, శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ప్రజల శ్రేయస్సు కోసం ఈ ఏకాదశి పర్వదినాన్ని విశిష్టంగా జరుపుకోవాలని కోరుకుంటున్నారు.



పూజకు ముందుగా ఆలయ ప్రధాన అర్చకులు, నాయిని దంపతులను పూర్ణ కుంభంతో, వేద మంత్రోచ్ఛారణలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. పూజ అనంతరం MLA దంపతులను ఆలయ వారధులు శాలువాతో సత్కరించారు.



ఆ తర్వాత నాయిని రాజేందర్ రెడ్డి, నీలిమ ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులకు స్వహస్తాలతో ప్రసాదాన్ని పంపిణీ చేస్తూ, వారితో కలిసి భక్తిపూర్వకంగా మమేకమయ్యారు.


ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.