*భద్రకాళీ దేవఆలయంలో శాఖంబరి ఉత్సవాల సమన్వయ కమిటీ సమావేశం*
9 views డిజిటల్ న్యూస్ వరంగల్ జూలై 03: భద్రకాళీ దేవఆలయంలో ఎండోమెంట్ డిపార్ట్మెంట్, నూతన కార్య వర్గo (జి డబ్ల్యూ ఎం సి) విద్యుత్. (కుడ) రెవిన్యూ ట్రాఫిక్ పోలీస్ మరియు లా & ఆర్డర్ పోలీస్ విభాగాలతో సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేసారు .
శాఖంబరి ఉత్సవాల సందర్భంగా భద్రకాళీ మాత దేవాలయానికి అమ్మవారి దర్శనానికి విచ్చేయుచున్న భక్తులకు సకల సౌకర్యార్థం ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా క్యూలైన్లు ఇబ్బందులు కలగకుండా తోపులాట జరగకుండా ఉండడం కొరకు ఒక ప్రణాళికను సిద్ధం చేసి వాటిని అమలు చేయడానికి సమావేశం ఏర్పాటు .
ఉత్సవాలకు సీసీ కెమెరాలు, ట్రాఫిక్ , ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ వన్ వే బారికెట్లు క్యూ లైన్ బారికెట్లు ఏర్పాట్లు చేయడానికి ప్రణాళిక రూపొందించి అమలుపరచడానికి అన్ని విధాలుగా సహాయక సహకారాలు అందించాలని కోరారు.