ఎస్. టి. కాలనీలో ఘనంగా సికిల్ సెల్ అనీమియా పక్షోత్సవాలు డాక్టర్ లక్ష్మీ ప్రసన్న కలికిరి

 ఎస్. టి. కాలనీలో ఘనంగా సికిల్ సెల్ అనీమియా పక్షోత్సవాలు డాక్టర్ లక్ష్మీ ప్రసన్న కలికిరి



9veiws digital news 3/7/25 : మండల కేంద్రం లోని ఎస్. టి. కాలనీలో మెడిక్కుర్తి పి. హెచ్. సి వైద్యులు డాక్టర్ లక్ష్మీ ప్రసన్న ఆధ్వర్యంలో ఘనంగా సికిల్ సెల్ అనీమియా పక్షోత్సవాలు నిర్వహించడం జరిగింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖధికారి వారి ఆదేశాల మేరకు డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ మరియు టి. బి. పర్యవేక్షకులు నాగిరెడ్డి లు సికెల్ సెల్ అనీమియా పక్షోత్చవాల (19/6/25 నుండి 3/7/25) ముగింపు సందర్బంగా ప్రజలకు కలికిరి ఏ. ఎమ్. సి. డైరెక్టర్ శ్రీనివాస శర్మ అధ్యక్షతన అవగాహన కల్పించారు.




ఈ సందర్బంగా డి. హెచ్. ఈ. ఓ. మహమ్మద్ రఫీ మాట్లాడుచు సికెల్ సెల్ అనీమియా రక్తపరీక్షలు ఎస్. టి. కాలనీ లోని 40సంవత్సరాలలోపు ప్రజలు అందరు చేయించుకోవాలని అన్నారు. సికిల్ సెల్ రక్తహీనత పై 2047సంవత్సరానికి సికిల్ సెల్ అనీమియా నిర్మూలన మిషన్ లో భాగంగా అవగాహన కల్పించి కరపత్రాలు పంపిణీ చేశారు. సికెల్ సెల్ అనీమియా వ్యాధి వారస్వతంగా వచ్చే ఎర్ర రక్తకణముల వ్యాధి. ఈ జబ్బు తల్లిదండ్రుల నుండి జన్యుపరంగా పిల్లలకు వస్తుంది. సికిల్ సెల్ ఎనిమియా వ్యాధి లక్షణాలు రక్తకణాల సంఖ్య తగ్గడం, కళ్ళు పసుపు రంగు లోకి మారడం, తీవ్రమైన వళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, శ్వాస తీసుకోవడం లో కష్టం, అలసట, తరచుగా వచ్చే అంటువ్యాధులు, గర్భ ధారణ సమయం లో సమస్యలు, అవయవ వైపల్యం, పెరుగుదల సమస్యలు. ఈ వ్యాధి నిర్ధారణ కొరకు ప్రతీ ఆరోగ్య కార్యకర్త దగ్గర పరీక్ష కిట్స్ అందుబాటులో ఉన్నాయి. 




ఒక్క చుక్క రక్తం తో పరీక్ష చేసుకోవచ్చు. సున్నా నుండి 40సంవత్సరాల లోపు గిరిజనులు పరీక్షలు చేసుకోవాలి. వ్యాధి నిర్ధారణ ఐతే హైద్రాక్సీ యూరియా మాత్రలు తో పాటు ఫోలిక్ ఆసిడ్ మాత్రలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అవసరం ఐతే రక్తం ఎక్కించాలిసి వస్తుంది.వివాహనికి ముందు అమ్మాయి, అబ్బాయి ఇద్దరు సికిల్ సెల్ రక్త పరీక్షలు చేయించుకోవాళన్నారు. ప్రతీ సచివాలయం లో ఉన్న ఆరోగ్య కార్యకర్తల దగ్గర కిట్ అందుబాటులో ఉన్నాయని ప్రజలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాళన్నారు.




వ్యాధి యొక్క స్థాయి ని బట్టి ఎముక మజ్జ మార్చబడుతుంది అన్నారు. అనంతరం సికిల్ సెల్ అనీమియా ప్రజల భాగస్వామ్యం తో ర్యాలీ చేయడం జరిగింది. ప్రజల చేత నినాదాలు చేస్తూ ప్లేకార్డ్స్ ప్రదర్శన చేయడం జరిగింది. మొత్తం 15మందికి సికిల్ సెల్ పరీక్షలు చేయడం జరిగింది.. ఈ కార్యక్రమం లో డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ, ఎస్. టి. ఎస్. నాగిరెడ్డి, పర్యవేక్షకులు సుధాకర్, ఎమ్. ఎల్. హెచ్. పి లు, ఏ. ఎన్. ఎమ్ లు, ఆశాకార్యకర్తలు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.