*బిసి కమ్యూనిటీ హల్ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య*
9 views డిజిటల్ న్యూస్ హన్మకొండ జూలై 03:
హన్మకొండ బిసి కమ్యూనిటీ హల్ భవన నిర్మాణ పనుకుల సందర్భంగా వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య మాట్లాడుతూ...సంకల్పం గట్టిగా ఉంటే ఎంతటి పని అయినా సాధించవచ్చని.. అందుకు ఈ కమ్యూనిటీ హల్ ఒక నీదర్శనమని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అన్నారు. బీమారం 55వ డివిజన్ లో
ఎంపీ గారి నిధుల నుండి 20 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న బిసి కమ్యూనిటీ హల్ భవన నిర్మాణ పనుకులకు వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ..... జర్నలిస్ట్ నాయకపు సుభాష్ జ్ఞాపకార్థంగా ఈ రోజు కమ్యూనిటీ హల్ నిర్మాణానికి శంకుస్థాపన చేసుకుని త్వరలో ప్రారంభించుకో బోతుంన్నామని తెలిపారు. ఈ కమ్యూనిటీ హాల్ కోసం సుభాష్ ఎంతగానో కృషి చేశాడని వారి సంకల్పం వల్లే ఈ రోజు సాధ్యం అయ్యిందన్నారు. సుభాష్ ఇప్పుడు మన మధ్యలో లేక పోవడం బాధాకరమని అన్నారు. మరో రెండు నెలల్లో కమ్యూనిటీ హల్ నిర్మాణం పూర్తి చేయాలన్నారు. సుభాష్ కుటుంబ సభ్యులు వారి వ్యక్తిగతంగా సహాయం కొరకుండా అందరికి ఉపయోగపడేలాగా వారి జ్ఞాపకార్థంగా కమ్యూనిటీ హాల్ ఉండాలని కోరుకోవడం గొప్ప విషయం అన్నారు.
ఈ సందర్భంగా సుభాష్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఆత్మస్థైర్యాన్ని కల్పించాలని భగవంతున్ని ప్రార్థించారు. ఇటివల పలువురు జర్నలిస్ట్ ల ఆకాల మరణలు తనను ఎంతో బాధించాయని ఎంపీ అన్నారు. రాత్రి, పగలు అని తేడా లేకుండా పని చేస్తున్న జర్నలిస్టు సోదరులు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ జక్కుల రజిత - వెంకటేశ్వర్లు ఇతర ప్రజా ప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.