పదవి విరమణ జరుపుకుంటున్న బి..రామరాజు
9views, పీలేరు మండలం, జులై 02: ఉపాధ్యాయులుగా పదవీ విరమణ చేస్తున్న బి రామరాజు వీరు 42 సంవత్సరాల క్రితం ఉద్యోగంలో చేరి అనేకమంది విద్యార్థిని, విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందించి అనేకమందికి జీవితాలకు బంగారు బాటలు వేసే విధంగా బోధించడం జరిగింది.
30. 6. 2025 వీరు పదవీ విరమణ చేయుసందర్భంగా పీలేరు ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయులుగా రెండు సంవత్సరాలు క్రితం చేరి పదవి విరమణ పొందుతున్నారు.
ఈ కార్యక్రమంలో రామరాజు మాట్లాడుతూ నేను అనేకమంది పిల్లలకు పాఠాలు నేర్పించి వారి ఉన్నత శిఖరాలకు వెళ్ళేటట్టు సేవ చేయడం ,నాకు ,నా కుటుంబానికి ఆ దేవదేవుడు దయవలన పిల్లలకు సేవ చేసే మార్గం ఇవ్వడం జరిగింది.
కావున ప్రతి ఒక్క విద్యార్థి, విద్యార్థిని కూడా భవిష్యత్తులో మంచి అలవాట్లతో చదివి తమ భవిష్యత్తును దిద్దు కొనీ బంగారువేసే విధంగా తయారు కావాలి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు తోటి ఉపాధ్యాయు నీఉపాధ్యాయులు అందరూ కూడా రామరాజు సేవలు కొనియాడారు.
ఈ కార్యక్రమంలో సిఆర్పి జె.మురళీధర్ మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరూ కూడా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది.