కొండపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో టీబీ వ్యాధి పై అవగాహన కార్యక్రమం
9veiws digital news ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం, జూలై 5 : కొండపల్లి ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో గొల్లపూడి పంచాయతీ పరిధిలోని రామరాజ్యనగర్ నందు వున్న గొల్లపూడి సచివాలయం 4 నందు జరిగిన మెడికల్ క్యాంపు నందు ఇంటెన్సిఫైడ్ టీబీ కాంపెయినింగ్ నిర్వహించడం మైనది.
ఈ కార్యక్రమానికి డాక్టర్ రాథోడ్ పాల్గొని టీబీ వ్యాధి గురించి మరియు లక్షణాలు తీసుకోవలిసిన జాగ్రత్తలు గురించి ప్రజలకు తెలియచేసారు.టీబీ కాంపెయినింగ్ పోస్టర్ ప్రజలకు చూపిస్తూ టీబీ వ్యాధి లక్షణాలు తెలియచేశారు.
టీబీ అనేది అంటు వ్యాధి అని పూర్తిగా మందులు వాడటంవలన వ్యాధి తగ్గుతుంది అని టీబీ వచ్చిన వారితో పాటు కుటుంబసభ్యులు టీబీ రాకుండ ముందస్తుగా ప్రీవెంటివ్ టీబీ ట్రీట్మెంట్ తీసుకున్న యెడల టీబీ వ్యాప్తిని నివారించవచ్చు అని తెలిపారు.
ఈ కార్యక్రంలో టీబీ యూనిట్ ఇబ్రహీంపట్నం సిబ్బంది మరియు ఎమ్.ఎల్.హెచ్.పి,ఎ.యన్.ఎమ్, మరియు ఆశ వర్కర్లు పాల్గొన్నారు.