జూలై 9వ తేదీ న సమ్మెలోకి మధ్యాహ్న భోజన కార్మికులు పాఠశాల శానిటేషన్ కార్మికులు

 జూలై 9వ తేదీ న సమ్మెలోకి మధ్యాహ్న భోజన కార్మికులు పాఠశాల శానిటేషన్ కార్మికులు


ఎన్టీఆర్ జిల్లా,మైలవరం, జూలై 5, (9వ్యూస్) : ఈనెల 9వ తేదీ జరుగు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా మైలవరం మండలంలోని మధ్యాహ్న భోజన కార్మికులు మరియు పాఠశాలలో పనిచేస్తున్న శానిటేషన్ కార్మికులు శనివారం ఉదయం మండల విద్యాశాఖ అధికారి(ఎంఈఓ) బి బాలు కి సమ్మె నోటీసులు అందజేశారు.


ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్ సుధాకర్ మధ్యాహ్న భోజన కార్మిక సంఘం అధ్యక్ష కార్యదర్శులు బి శేషమ్మ వరలక్ష్మి సంపతి పాఠశాల శానిటేషన్ వర్కర్స్ యూనియన్ నాయకులు అంజలి నాగమణి తదితరులు పాల్గొన్నారు.

వారు మాట్లాడుతూ కనీస వేతనం అమలు చేయాలని పెరిగిన ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలు పెంచాలని సెలవు దినాల్లో కనీసం సగ వేతనం ఇవ్వాలని ఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని తదితర డిమాండ్లతో జరుగుతున్న దేశ వ్యాప్త సమ్మె జయప్రదం చేయాలని 


ఈ సమ్మె కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగానూ కార్మిక చట్టాలు పరిరక్షణ కోసం జరుగుతుందని సమ్మెలో కార్మిక వర్గం అంత ఐక్యంగా పాల్గొని సమ్మె విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.