జూలై 9వ తేదీ జరుగు జాతీయ సమ్మె జయప్రదం చేయండి
_బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ మండల కమిటీ సభ్యులు అల్లూరి నాగేశ్వరరావు,మర్రి వాసు_
*ఎన్టీఆర్ జిల్లా, జూలై 5, (9వ్యూస్) : దేశవ్యాప్తంగా ఈ నెల 9వ తేదీ జరుగుతున్న కార్మిక సమ్మె జయప్రదం చేయాలని కోరుతూ చండ్ర గూడెం గ్రామంలో భవన నిర్మాణ కార్మికులు కరపత్ర ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం మైలవరం మండల కమిటీ సభ్యులు అల్లూరి నాగేశ్వరరావు మర్రి వాసు మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్స్ తీసుకు వచ్చిందని దీనివల్ల కార్మికులుగా తాము తీవ్రంగా నష్టపోతామని ఇబ్బందులకు గురవుతామని వారు అన్నారు తక్షణమే నాలుగు లేబర్ కోట్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని వారికి రావలసిన సంక్షేమ పథకాలు వచ్చే పరిస్థితి లేకుండా పోయిందని కనీసం ప్రమాద బీమా లు కూడా రావడంలేదని, లేబర్ ఇన్సూరెన్స్ కార్డ్స్ కూడా ఇచ్చే పరిస్థితిలో లేబర్ కార్యాలయాలు లేకుండా పోయినాయి అని వాపోయారు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సంక్షేమ బోర్డు పున ప్రారంభించి నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని కోరారు.