ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటు పడాలి
9వ్యూస్, సూర్యాపేట , జులై 06: ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటి పర్యావరణ పరిరక్షణకు భాగస్వామ్యం కావాలని జిల్లా ఆర్యవైశ్య మహాసభ కోశాధికారి చల్లా లక్ష్మీకాంత్ తెలిపారు. ఆదివారం జిల్లా ఆర్యవైశ్య మహాసభ పిలుపుమేరకు...
ఆర్యవైశ్య హరిత స్ఫూర్తి కార్యక్రమంలో భాగంగా సూర్యాపేటకు చెందిన జిల్లా ఆర్యవైశ్య మహాసభ సంయుక్తకార్యదర్శి సోమ ప్రవీణ్ కుమార్ కుమార్తె నందిని పుట్టినరోజు సందర్భంగా నూతన వ్యవసాయ మార్కెట్ లోని కనకదుర్గ దేవాలయం లో మొక్కలు నాటారు..
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోజురోజుకు క్షీణించిపోతున్న పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మీ ఇంటితో పాటు మీ పరిసర ప్రాంతాల్లో ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాలన్నారు.
పుట్టినరోజులు, పెళ్లిరోజుల సందర్భంగా ఒక మొక్క నాటి పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటున అందించాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు కక్కిరేణి చంద్రశేఖర్ కనకదుర్గ దేవాలయం కమిటీ ముప్పారపు బాబురావు, కంది బండ సూరయ్య, మిర్యాల కొండల్ రావు,ఉప్పల సత్యనారాయణ , చల్లా సత్యనారాయణ, బజ్జూరి శ్రీనివాస్, తూడి విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు..