మొహర్రం సందర్భంగా పీరీలను దర్శించుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
9వ్యూస్ , జగిత్యాల జిల్లా, జులై 06: మొహర్రం పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మరియు వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదివారం రోజున ధర్మారం పట్టణ కేంద్రంలోని పీరీలను దర్శించుకుని మొహర్రం పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా మొహర్రం పర్వదినం త్యాగానికి, సహనానికి,సమానత్వానికి ప్రతీకగా నిలుస్తుందని,రాష్ట్రంలో మతసామరస్యం,ఐక్యత బలపడేలా ప్రభుత్వం కట్టుబడి పని చేస్తున్నదనీ తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు,ముస్లిం మతపెద్దలు,అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.