చిల్లేపల్లి నుండి కల్లూరు ఎక్స్ రోడ్ మధ్య జరిగే రహదారి పనులు త్వరగా పూర్తి చేయాలి
9views డిజిటల్ న్యూస్ జూలై 5 సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం చిల్లేపల్లి నుండి కల్లూరు ఎక్స్ రోడ్ వరకు నత్త నడకన రోడ్డు పనులు చిల్లేపల్లి నుండి కల్లూరు వరకు మంజూరైన రోడ్డు పనులు అస్తవ్యస్తంగా అసంపూర్తిగా కొనసాగుతున్నాయి.
పనులు మొదలుపెట్టి దాదాపు సంవత్సరం కావస్తున్న ఇంకా పూర్తిగాని కల్వర్టులు రోడ్డు వెడల్పులో భాగంగా పనులు చేపడుతున్నారు గతంలో ఇదే రోడ్డు ఇదే కాంట్రాక్టర్ దాదాపు మూడు సంవత్సరాలకు సింగిల్ రోడ్డు పూర్తి చేశారు మరలా అదే కాంట్రాక్టర్ కి ఈ రోడ్డు బాధ్యతలు అప్పగించారు.
చిల్లేపల్లి నుండి హై స్కూల్ వరకు నామమాత్రంగా పని చేశారు అక్కడినుండి బూర్గుల తండా వరకు రోడ్డు వెడల్పు కార్యక్రమం మొదలు పెట్టలేదు మరల కల్లూరు ఎక్స్ రోడ్ నుండి బూర్గుల తండ వరకు కొంతవరకు పనులు చేశారు ఈ రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
ఈ యొక్క రోడ్డు పూర్తి అయితే ప్రయాణికులకు రైతులకు వాహనదారులకు ఇబ్బంది లేకుండా ప్రయాణం జరుగుతుంది కావున సంబంధిత అధికారులు దీనిని పర్యవేక్షించి పనులు త్వరగా అయ్యేలా చూడాలని పరిసర ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.