శ్రీ సంతోషిమాత దేవాలయంలో ముగిసిన శ్రీ వారాహి నవరాత్రోత్వములు
9వ్యూస్, సూర్యాపేట, జులై 05: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోషిమాత దేవాలయం లో జూన్ 26 న ప్రారంభమైన శ్రీ వారాహి నవరాత్రి ఉత్సవాలు శనివారం తో ముగిసినవి. ఈ సందర్భంగా దేవాలయ అర్చకులు బట్టారం వంశీకృష్ణ శర్మ 10 వ రోజు శ్రీ మహా వారాహిదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అందులో భాగంగా ప్రత్యేక గాజుల పూజ నిర్వహించారు.మహిళలు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అమ్మవారికి వడి బియ్యం పోశారు. మహాగణపతి, లక్ష్మీ గణపతి, నవగ్రహ, కాలభైరవ సహిత వారాహి మాత మూల మంత్ర హోమం నిర్వహించి సంపూర్ణ పూర్ణాహుతి నిర్వహించారు.మంత్ర పుష్పము నిర్వహించి 9 రోజులు గా ప్రతిష్టించిన మహా కలశము ఉద్వాసన చేశారు. మాలలు వేసుకున్న స్వాములకు మాల విసర్జన నిర్వహించారు. అనంతరం5భక్తులకు అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో దేవాలయ అద్యక్షులు నూక వెంకటేశ్వం గుప్తా ప్రధాన కార్యదర్శి బ్రాహ్మ0డ్లపల్లి మురళీధర్ తో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.