ఒక్కరి కోసం అందరం, అందరి కోసం ఒక్కరం అనే లక్ష్యంతో యాదవులందరిని ఏకం చేస్తాం :గనవేని మల్లేష్ యాదవ్

ఒక్కరి కోసం అందరం, అందరి కోసం ఒక్కరం అనే లక్ష్యంతో యాదవులందరిని ఏకం చేస్తాం :గనవేని మల్లేష్ యాదవ్


 యాదవ సంఘం అడహాక్ కమిటీ జగిత్యాల జిల్లా వ్యవస్థాపక అధ్యక్షుడు గనవేని మల్లేష్ యాదవ్


9వ్యూస్, జగిత్యాల , జులై 06: జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్న యాదవులలో ఎవ్వరికి కష్టం వచ్చిన, అన్యాయం జరిగిన ఒక్కరి కోసం అందరం అందరికోసం ఒక్కరం అనే లక్ష్యంతో యాదవులందరిని ఏకం చేసి ముందుకు సాగుతామని, రాష్ట్రంలో యాదవ జన దామాషా ప్రకారం ప్రభుత్వాల పరంగా, పార్టీల పరంగా, కుల సంఘాల పరంగా న్యాయంగా యాదవులకు దక్కాల్సిన ప్రాధాన్యతను,హక్కులను సాధించుకునే వరకు పోరాడదామని యాదవ సంఘం అడహాక్ కమిటీ జగిత్యాల జిల్లా వ్యవస్థాపక అధ్యక్షుడు గనవేని మల్లేష్ యాదవ్ అన్నారు..



రాయికల్ మండలం భూపతిపూర్ గ్రామ యాదవ సంఘ సమావేశం భూపతిపూర్ యాదవ సంఘ భవనంలో జరగగా ఇట్టి సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు మ్యాదరవేని రామంజనేయులు యాదవ్ పంచతి శంకర్ యాదవ్ లతో కలిసి పాల్గొని సభ్యత్వ నమోదుతో సంఘ బలోపేతం, సమస్యల పరిష్కారం,న్యాయంగా యాదవులకు దక్కాల్సిన హక్కుల సాధన తదితర విషయాలు చర్చించారు..



అనంతరం భూపతి పూర్ గ్రామ యాదవ సంఘ సభ్యులు మొత్తం 86మంది సభ్యత్వం తీసుకోగ వారికి ఇంచార్జిలతో కలిసి సభ్యత్వ రసీదులందించిన జిల్లా అధ్యక్షుడు గనవేని మల్లేష్ యాదవ్.


ఈ కార్యక్రమంలో బొడ్డు చిన్నమల్లయ్య, బొడ్డు చిన్న మల్లేశం,మంత్రి కొమురయ్య, మంత్రి పోచమల్లయ్య, గోనె రాములు, నేతుల లక్ష్మి నారాయణ , ధనరేకుల శ్రీనివాస్ , తాలుక చిన్నమల్లయ్య, ముద్ధం మలయ్య,పీలి నర్సారెడ్డి, ఆసరి శంకర్, మంత్రి రాజుకుమార్,నాగెల్లి పద్మ,జక్కుల నర్సయ్య శీలం మధు సంఘ సభ్యులు పాల్గొన్నారు..

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.