మానుకోట నియోజకవర్గంలో జులై 8న జరిగే మహా సభను విజయవంతం చేయగలరు _ఎమ్మెల్యే డా మురళీ నాయక్
9వ్యూస్, మహబూబాబాద్, జులై 06: భారత మాజీ ఉప ప్రధాని, బాబు జగజ్జీవన్ రామ్ వర్థంతి సందర్భంగా మహబూబాబాద్ పట్టణంలోని విగ్రహానికి స్థానిక నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనమైన నివాళులర్పించిన మహబూబాబాద్ ఎమ్మెల్యే డా భూక్యా మురళీ నాయక్
భారత దేశం ఉప ప్రధాని స్వతంత్ర సమర యోధుడు సమాజ నిర్మాత బాబు జగ్జీవన్ రామ్ 39 వ వర్ధంతిని నేడు మహబూబాబాద్ మున్సిపాలిటీ కేంద్రంలోనీ మదర్ తెరిసా సెంటర్లో వున్న విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన మహబూబాబాద్ శాసనసభ్యులు డా భూక్యా మురళీ నాయక్
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా మురళీ నాయక్ మాట్లాడుతూ.. గాంధీజీ చేత అమూల్య భారత రత్నగా పిలువబడే బాబు జగ్జీవన్ రామ్ సామాజిక వివక్ష, అసమానతలు లేని ఒక స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య, సమాజ నిర్మాణం కోసం తన జీవితాంతం కృషిచేశారని పేర్కొన్నారు.
స్వాతంత్య్రం వచ్చాక మూడు దశాబ్దాలకు పైగా కేంద్ర మంత్రిగా, దేశ ఉప ప్రధానమంత్రిగా పనిచేసి మచ్చలేని నాయకుడిగా ఆదర్శ జీవితం గడిపారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
స్వాతంత్య్ర సమరయోధుడు, సామాజిక సంస్కర ణోద్యమనేత బాబు జగ్జీవన్ రామ్ వర్థంతి సందర్భంగా ఆ మహనీయునికి నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు.
మారుమూల బీహార్ రాష్ట్రంలో వారు 1932 వ సంవత్సరంలో దళిత గిరిజన కు జరుగుతున్న అంటారని తన్ననీ చూసి వారు స్థాయిలో నుండి దళిత గిరిజన హక్కుల కోసం బాబు జగ్జీవన్ రావు ఉద్యమాన్ని తీసుకువచ్చారు...
దళితులు అని చెప్పుకునే స్థాయి నుండి...వారి భారత దేశానికి రక్షణ శాఖా మంత్రిగా భారత దేశ ఉప ప్రధానిగా సేవలు అందించిన వ్యక్తి బాబు జగ్జీవన్ రావు.
మన కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటూ సీలింగ్ యాక్ట్ పెట్టీ దళితులకు 5 ఎకరాల భూమి ఇచ్చిన ప్రభుత్వం అంటే అంది కాంగ్రెస్ పార్టీ
దళితులలో కొన్ని ఉప కులాలుగా విభజించి ప్రతి ఒక్కరికి సమానంగా న్యాయం జరగాలని చట్టబద్ధంగా చట్టాలు తీసుకొచ్చి వారికి ఉన్నత స్థాయిలో ఉండేలా వారికి అవకాశాలు ఇచ్చిన పార్టీ అంటే ఆది కాంగ్రెస్ పార్టీ..
అదేవిధంగా కులగణన ఎస్సీ రిజర్వేషన్ చేసిన పార్టీ అంటే ఆది కాంగ్రెస్ పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేశారు
మానుకోట నియోజకవర్గంలో జులై 8న జరిగే మహా సభను విజయవంతం చేయాలని కోరారు
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, పట్టణ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, యూత్ నాయకులు,వివిధ సంఘాల నాయకులు, మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు