9వ తారీఖున జరగబోయే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని గోడపత్రిక ఆవిష్కరణ
9views డిజిటల్ న్యూస్ జూలై 5 నేరేడుచర్ల మండలంలో టి యు సి ఐ ఆధ్వర్యంలో 9వ తారీఖున జరగబోయే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని గోడపత్రిక ఆవిష్కరణ
ఇట్టి కార్యక్రమంలో టి యు సి ఐ జిల్లా కార్యదర్శి సయ్యద్ హుస్సేన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న నాలుగు నెలల చట్టాలను రద్దు చేయాలని పనికి తగ్గ వేతనం ఇవ్వాలని మరియు
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తానన్న అన్ని పథకాలను వెంటనే అమలు చేయాలని అన్ని కార్మిక సంఘాలతో కలిసి 9వ తారీఖున జరగబోయే బహిరంగసమ్మెను విజయవంతం చేయాలని గోడ పత్రికను ఆవిష్కరించడం జరిగింది .
ఈ కార్యక్రమంలో టి యు సి ఐ జిల్లా నాయకులు షేక్ రజాక్ హుజూర్నగర్ ఆటో యూనియన్ నాయకుడు బైరం ఆనంద్ దేవయ్య తాళ్లూరి లక్ష్మయ్య నాగయ్య కట్టా దేవయ్య తాళ్లూరి రంగయ్య గడ్డి శాంతయ్య మాతంగి విజయ్ తదితరులు పాల్గొనడం జరిగింది.