కాజీపేట వెంకటలక్ష్మి కూరగాయల మార్కెట్ మీద అధికారుల చిన్న చూపు. నార్లగిరి రామలింగం మాజీ కార్పొరేటర్ – బిజెపి పార్టీ సీనియర్ నాయకులు
9 views డిజిటల్ న్యూస్ హన్మకొండ జిల్లా కాజీపేట జూలై 03: కాజీపేట వెంకటలక్ష్మి కూరగాయల మార్కెట్ విషయం లో నార్లగిరి రామలింగం మాట్లాడుతూ అనేకసార్లు కాజిపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కి వినతి పత్రాలు అందజేస్తూనే ఉన్నాము.
కానీ అధికారులు అ పత్రాలను చూసి చూడనట్టుగా ముఖం చాటేస్తున్నారు. దీనివల్ల రోడ్ల పైన చిరు వ్యాపారులు కూరగాయలు అమ్మడంతో మార్కెట్లోకి ఎవరూ రావడం లేదని మార్కెట్లోని వ్యాపారులు జరగడం కష్టంగా ఉంది.
దీనిని వీలైనంతవరకు ఈ రెండు మూడు రోజుల్లో పరిష్కరించాలని కాజీపేట కమిషనర్ ని హెచ్చరిస్తున్నారు. లేనియెడల వెంకటలక్ష్మి కూరగాయల మార్కెట్ వ్యాపారులచే కాజీపేట మున్సిపల్ కార్పొరేషన్ను ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాము.
చేతకాకపోతే కమిషనర్ తక్షణమే రీజన్ చేయాలని డిమాండ్ చేస్తున్నా. అని అన్నారు.ఈ కార్యక్రమానికి చుట్టుపక్క గ్రామాల ఆసాములు మరియు వ్యాపారస్తులు సహకరించాలని కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ నాయకులు చాంద్ పాషా, మార్కెట్ అధ్యక్షులు నిషాని బిక్షపతి, ఏసు, కలమ్మ ,కొమరమ్మ ,స్వరూప, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు..