ఇంటింటికి పైపులైన్ శంకుస్థాపన కార్యక్రమాల ఏర్పాట్లను పరిశీలించిన మార్కాపురం ఎమ్మెల్యే మరియు జిల్లా కలెక్టర్
9views, మార్కాపురం, జులై 02: ఈ నెల 4వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ 1290 కోట్ల రూపాయలతో ఇంటింటికి పైపులైన్ శంకుస్థాపన మార్కాపురం పట్టణంలో చేయనున్నారు.
ఈ నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లును ఈరోజు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి, జిల్లా కలెక్టర్ తమిమ్ అన్సారీయా, జనసేన నియోజకవర్గ ఇంచార్జి కాశీనాథ్ పర్యవేక్షించారు.
మొదటిగా తర్లుపాడు రోడ్ లోని అల్లూరి పోలేరమ్మ దేవస్థానం దగ్గరలో ఉన్న హెలిపాడ్ ను, పక్కనే ఉన్న సాయి బాలాజీ స్కూల్ ఎదుట సభాస్థలి ప్రాంగణాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ 1290 కోట్ల రూపాయలతో వెనుకబడిన ఈ ప్రాంతంలో ఇంటింటికి పైప్ లైన్ ఏర్పాటుకు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,
ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ బాబు ఖుషి ఎంతో దాగి ఉందని వారందరికీ ఈ ప్రాంత ప్రజలు రుణపడి ఉంటారని అన్నారు.
4.7.2025 తేదీన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ స్కీంను అల్లూరి పోలేరమ్మ దేవస్థానం ఎదుట ఉన్న ప్రాంతంలో శంకుస్థాపన చేయనున్నారని దీనికి మార్కాపురం నియోజకవర్గంలోని ప్రజలందరూ తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు.