వెదురు బీడం గ్రామ కమిటీ అధ్యక్షలుగా వెల్లంకి ప్రేమ్ కుమార్ ఎన్నిక
ఎన్టీఆర్ జిల్లా,మైలవరం, జూలై 2, (9వ్యూస్): వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ ఆదేశాల మేరకు మైలవరం మండల పార్టీ అధ్యక్షుడు గర్నెపూడి వెంకట్రావు ఏఎంసి మాజీ చైర్మన్ అప్పిడి సత్యనారాయణ రెడ్డి మైలవరం నియోజకవర్గ సీనియర్ నాయకులు దుర్గాప్రసాద్ తోట తిరుపతిరావు పాల కృష్ణ సమక్షంలో వెదురు బీడం గ్రామ వైసిపి అధ్యక్షులుగా వెల్లంకి ప్రేమ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ అవకాశం కల్పించిన జోగి రమేష్ కి పార్టీ పెద్దలకు వెదురు బీడం పోరాట నగర్ గ్రామ వైసిపి కార్యకర్తలకు నాయకులకు అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వెదురు బీడం పోరాట నగర్ గ్రామ వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.