తెలంగాణ రాష్ట్ర కార్మిక మరియు గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిని మర్యాదపూర్వకంగా కలిసిన టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర కార్మిక మరియు గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిని మర్యాదపూర్వకంగా కలిసిన టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి


9views,హైదరాబాద్, జులై 02: తెలంగాణ రాష్ట్ర నూతన మంత్రిగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని వారి నివాసంలో టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ మరియు పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జి ఝాన్సీ రాజేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.



ఈ సందర్భంగా మంత్రికి శుభాకాంక్షలు తెలుపుతూ, ప్రజల సంక్షేమం కోసం ఆయన తీసుకునే నిర్ణయాలకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని ఝాన్సీ రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు. రాజకీయ, సాంఘిక సేవలలో వివేక్ వెంకటస్వామి కలిగిన అనుభవం రాష్ట్రానికి ఎంతో ప్రయోజనకరంగా మారుతుందని వారు అభిప్రాయపడ్డారు..


మంత్రి కూడా ఝాన్సీ రాజేందర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ శక్తివంచన లేకుండా పనిచేస్తుందని తెలిపారు. పార్టీని బలోపేతం చేసేందుకు నాయకత్వంలో ఐక్యత అవసరమని, అందులో ఝాన్సీ రెడ్డి పాత్ర ప్రాముఖ్యతను ఆయన కొనియాడారు..

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.