కొండపల్లిలో ఘనంగా వంగవీటి మోహనరంగా జయంతి వేడుకలు
ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం, జూలై 4, (9 వ్యూస్) : వంగవీటి మోహన్ రంగా జయంతి వేడుకలు జనసేన బీజేపి రంగా అభిమానుల ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
కొండపల్లి మున్సిపాలిటీ లో ఉన్న వంగవీటి మోహనరంగా విగ్రహాలకు జనసేన పార్టీ మైలవరం ఇంచార్జి అక్కల గాంధీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో జనసేన బీజేపి పార్టీ నాయకులు కార్యకర్తలు వీరమహిళలు వంగవీటి మోహనరంగా అభిమానులు తదితరులు పాల్గొన్నారు.