బీరన్న స్వామి బోనాల పండుగ ముఖ్య అతిథిగా వరంగల్ తూర్పు మాజీ శాసనసభ్యులు నన్నపునేని నరేందర్
9 views digital News వరంగల్ జూలై 06:కురుమ కులస్తుల ఆరాధ్యదైవం శ్రీ బీరన్న స్వామి దేవస్థానంలో బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. మహిళలు బోనాలు ఎత్తి, మంగళ వాయిద్యాల నడుమ పూజలు ఘనంగా నిర్వహించబడ్డాయి.
ముఖ్య అతిథిగా వరంగల్ తూర్పు మాజీ శాసనసభ్యులు నన్నపునేని నరేందర్ పాల్గొని, స్వామివారికి మొక్కుబడి బోనం సమర్పించి, భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా దేవస్థాన అధ్యక్షులు కంచ సారయ్య చైర్మన్ కంచ సంపత్ ,ముఖ్య నాయకులు చిలువేరు పవన్, పుల్లే రమేష్, కిషోర్, జక్కి, యుగేందర్, మహమ్మద్ ఇక్బాల్, శేషు, దయాసాగర్, ప్రభాకర్, శివాజీ, కనక శ్రీను తదితరులు పాల్గొన్నారు.