తెలంగాణ స్టేట్ లెవల్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నాయిని

తెలంగాణ స్టేట్ లెవల్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నాయిని



9 views digital News హన్మకొండ జూలై 06 ..హనుమకొండలోని జవహర్ నెహ్రూ స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, జాతీయ జెండాను ఆవిష్కరించి, క్రీడల పోటీలను అధికారికంగా ప్రారంభించారు.



ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ “దేశానికి వెన్నుముక నేటి క్రీడాకారులు” అన్నారు. క్రీడా రంగంలో అభివృద్ధి సాధించాలంటే క్రీడాస్పూర్తి అత్యవసరం, ఓటమికి భయపడకుండా ధైర్యంగా ముందుకు సాగాలని క్రీడాకారులకు సూచించారు.రాష్ట్రంలో క్రీడాకారులకు అవసరమైన మౌలిక వసతులు, శిక్షణ కేంద్రాలు, కోచింగ్ క్యాంపులు ఏర్పాటు చేస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రథమ ప్రాధాన్యతనిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం భారీ నిధులు కేటాయించిందని తెలిపారు. టాలెంట్ ఉన్న ప్రతి విద్యార్థికి – గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉన్నత స్థాయి వేదికలను అందించాలనే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని వెల్లడించారు.“క్రీడల్లో విజయం సాధించాలంటే దృఢ సంకల్పం, శ్రమ, క్రమశిక్షణ అవసరం.




 విజయం లభించకపోయినా పాఠం నేర్చుకుని ముందుకు సాగాలి. మీరు ఆడే ప్రతి మెట్టు, మీరు పెట్టే ప్రతి అడుగు – రాష్ట్రానికి, దేశానికి గౌరవం తీసుకురావాలి” అని అభిప్రాయపడ్డారు.

 అనంతరం ఎంపికైన క్రీడాకారులను, కోచ్‌లను వేదికపై అభినందించి, గుర్తింపుగా జ్ఞాపికలు బహూకరించారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.