విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం పాల్గొన్న మాజీ జోగి రమేష్
ఎన్టీఆర్ జిల్లా,విజయవాడ, జూలై 6,(9వ్యూస్):వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ మంత్రి మరియు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భవానిపురం లోని ఎస్ కన్వెన్షన్ లో జరిగిన..
పశ్చిమ నియోజకవర్గ బాబు ష్యూరిటీ - మో* గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొన్న మాజీమంత్రి మరియు మైలవరం నియోజకవర్గ ఇంచార్జ్ జోగి రమేష్ ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలు.అమలు చేయకపోవడాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తు రీకాలింగ్ చంద్రబాబూస్ మ్యానిఫెస్టో చంద్రబాబు మ్యానిఫెస్టోను గుర్తుకు తెస్తూ సమావేశం ఏర్పాటు చేయడమైనది.
ఈ సమావేశంలో పార్టీ పెద్దలు ఎన్టీఆర్ కృష్ణ జిల్లా పార్టీ పరిశీలకులు మోదుగు వేణుగోపాల రెడ్డి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఇంచార్జ్ మల్లాది విష్ణు విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఎమ్మెల్సీ రూహుళ్ల మరియు డిప్యూటీ మేయర్లు మరియు రాష్ట్ర అనుబంధ విభాగాల కమిటీ సభ్యులు,జిల్లా కమిటీ సభ్యులు జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు నియోజకవర్గ అనుబంధ విభాగాల అధ్యక్షులు మండల టౌన్ పార్టీ అధ్యక్షులు జడ్పీటీసీలు ఎంపీపీ ఎంపీటీసీలు సర్పంచ్ లు,గ్రామ పార్టీ అద్యక్షులు పాల్గొన్నారు.