5వ రోజు కొనసాగుతున్న సుపరిపాలనలో తొలి అడుగు

5వ రోజు కొనసాగుతున్న సుపరిపాలనలో తొలి అడుగు

_లంక లితీష్ ఆధ్వర్యంలో 103వ వార్డులో ఇంటింటికి ప్రచారం


ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, జూలై 6,(9వ్యూస్): మైలవరం నియోజకవర్గ అభివృద్ధి కృషివల్యుడు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ని తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు లంక లితీష్ కొనియాడారు.



సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా నాలుగవ రోజు మైలవరం పట్టణంలోని 102వ వార్డులో ఇంటింటికి ప్రచార కార్యక్రమం స్థానిక టిడిపి నేతలు కలిసి చేపట్టారు.


ఈ సందర్భంగా లితిష్ మాట్లాడుతూ మైలవరం పట్టణంలో ఎమ్మెల్యే కృషితో మునుపెన్నడు లేనివిధంగా సిసి రోడ్లు వివిధ అభివృద్ధి కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టారని అన్నారు.102వ వార్డు లో ప్రతి బజారులో దరిదాపుగా సిసి రోడ్లు నిర్మించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు.


ఇటీవల కురిసిన భారీ వరదలకు ముంపుకు గురైన ప్రాంతాల్లోని ప్రజల ఇబ్బందులను తొలగించేందుకు నేరుగా వసంత కృష్ణ ప్రసాద్ అన్ని ప్రాంతాలను సందర్శిస్తూ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా నాయకులను అధికారులను అప్రమత్తం చేస్తూ ప్రజల ఇబ్బందులను తొలగించిన శ్రమ కృషి ప్రతిఒక్కరు గుర్తించుకోవాలని యువనేత ఎద్దేవాచేశారు.


అనంతరం ఇంటింటికి కరపత్రాలను పంపిణీ చేస్తూ కూటమి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి ఏడాదిపాలనలో చేసినవి చేయబోయేవి వివరిస్తూ ప్రచారం ముగించారు.కార్యక్రమంలో టిడిపి నేతలు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.