పుల్లూరు గ్రామ కమిటీ అధ్యక్షులుగా వజ్రాల శివారెడ్డి ఎన్నిక
ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, జూలై 5, (9వ్యూస్) : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మైలవరం నియోజకవర్గం సమన్వయకర్త జోగి రమేష్ ఆదేశాల మేరకు
మైలవరం మండల పార్టీ అధ్యక్షుడు గర్నెపూడి వెంకట్రావు ఏఎంసీ మాజీ చైర్మన్ అప్పిడి సత్యనారాయణ రెడ్డి పిఎసిఎస్ మాజీ అధ్యక్షులు చిలుకూరి రామకృష్ణారెడ్డి మైలవరం నియోజకవర్గ సీనియర్ నాయకులు దుర్గ ప్రసాద్ తోట తిరుపతిరావు సమక్షంలో పుల్లూరు గ్రామ వైసిపి అధ్యక్షునిగా వజ్రాల శివారెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాకు ఈ అవకాశం కల్పించిన జోగి రమేష్ కి అప్పుడే సత్యనారాయణ రెడ్డికి చిలుకూరి రామకృష్ణారెడ్డికి అప్పిడి కిరణ్ కుమార్ రెడ్డికి పార్టీ పెద్దలకు గ్రామ వైసిపి నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా పెద్దలు సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ అందరూ అందరూ ఏకతాటిపై ఉండి 2029 లో వైసీపీ అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ తిరుపతి రావు ఎస్సీ సెల్ సక్కుర్తి గంగులు గ్రామ సర్పంచ్ నాగమల్లేశ్వరి ఉప సర్పంచ్ భాస్కర్ రావు ఎంపీటీసీ కృష్ణారెడ్డి పెద్దలు అప్పిడి సాంబ రెడ్డి గ్రామ నాయకులు పార్టీ అభిమానులు పాల్గొన్నారు.