అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వడమే మా ప్రభుత్వ ధ్యేయం…
అర్హుల ఎంపికలో పారదర్శకత ఉండాలని అధికారులను కోరిన ఎమ్మెల్యే…
పట్టణంలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ…
9వ్యూస్, వరంగల్ జిల్లా, జులై 06:నిజమైన అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలనేది ప్రజా ప్రభుత్వ సంకల్పం అని ఎమ్మెల్యే శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు అన్నారు ఆదివారం రోజు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 52 వ డివిజన్ పరిధిలోని బంజారా కాలనీ (రాం నగర్)ఇందిరమ్మ లబ్ధిదారుల ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ (ముగ్గు పోసి)చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా 3500 ఇళ్లు మంజూరు చేయగా ఇంకా అర్హులు ఉంటే మరిన్ని ఇళ్లను తీసుకువస్తానని తెలిపారు.అర్హుల ఎంపికలో అధికారులు పారదర్శకత పాటించాలని సూచించారు.
ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా ఎంపిక చేయాలని కోరారు.పూర్తి స్థాయి పట్టణ ప్రాంతంగా ఉన్న వరంగల్ నియోజవర్గంలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జాప్యంగా ఉందని అధికారులు మరింత వేగవంతం చేయాలని కోరారు.అర్హత ఉండి ఇందిరమ్మ ఇళ్ల విషయంలో దళారులని నమ్మవద్దని సూచించారు.
పసలేని ప్రతిపక్ష పార్టీల నాయకులు ప్రభుత్వం చేస్తున్న పనులకు ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని విద్యారంగంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో నూతన విద్యావిధానం అమల్లోకి తీసుకురావాలని 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల మంజూరు చేస్తే వ్యతిరేకిస్తున్న నేతలకు ప్రజలు బుద్ధి చెప్తారని ఎమ్మెల్యే కోరారు.దశాబ్ద కాలంగా అభివృద్ధి నోచుకొని నియోజవకర్గంలో ఒక్కొక్కటిగా అన్నిరంగాల్లో అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నాయిని లక్ష్మారెడ్డి,బంక సంపత్ యాదవ్ నాయకులు సుగుణాకర్ రెడ్డి,బాలు నాయక్,రాములు,దేవేందర్ రెడ్డి,మోహన్ నాయక్,వీరు ,సాయి మరియు కాలనీ నాయకులు,అధికారులు తదితరులు పాల్గొన్నారు.