అందరికీ ఆత్మీయ వ్యక్తి బడేమియా :పదవీ విరమణ సభలో జంపాల సీతారామయ్య
ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం, జూలై 2, (9వ్యూస్): డాక్టర్ ఎన్ టి టి పి ఎస్ లో సుదీర్ఘకాలం పనిచేసి పదవి విరమణ పొందిన మైనార్టీ నాయకులు మరియు కౌన్సిలర్ షేక్ రసూల్ తండ్రిగారైన షేక్ బడేమియా పదవి విరమణ సభలో పాల్గొన్నారు.
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మరియు రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి జంపాల సీతారామయ్య ఈ సందర్భంగా బడేమియా దంపతులను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
సన్మాన సభలో ఆయన మాట్లాడుతూ కార్మికుల కోసం పోరాటం చేస్తూ అందరితో ఆత్మీయంగా ఉండేవారిని అలాంటివారు పదవీ విరమణ పొందటం ఆయన లోటు తీర్చలేదని అన్నారు.
ఆయన దారిలోనే ఆయన కుమారుడు రసూల్ కౌన్సిలర్ గా ప్రజలకు సేవ చేస్తూ ఉండటం అభినందనీయమని తెలిపారు.