ఐలోని మల్లన్న ఆలయంలో తొలి ఏకాదశి పండుగ సందర్భంగా భారీగా తరలివచ్చిన భక్తులు
9views,ఐనవోలు మండలం,జులై06: అయినవోలు మల్లికార్జున స్వామి దేవస్థానం నందు ఈరోజు తొలి ఏకాదశి పండుగ సందర్భంగా ఆఖేరు వాగు నుండి కొత్తనీరు తీసుకువచ్చి స్వామివారికి మహన్యాస పూర్వక రుద్రాభిషేకం చేయడం జరిగినది.
అయినవోలు, ఒంటి మామిడిపల్లి, చుట్టుపక్కల గ్రామాల నుండి మహిళలు బిందెలతో నీళ్లను తీసుకొచ్చి వర్షాలు కురవాలి పాడిపంటలు సమృద్ధిగా పండాలని స్వామివారిని కోరుకుంటున్నారు.
దేవాలయ ఆవరణలోని భ్రమరాంబిక అమ్మవారి దేవాలయం నందు అమ్మవారిని శాకాంబరిగా రకాల కూరగాయల అలంకరణలో భక్తులకు దర్శనం ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో దేవాలయ కార్యనిర్వాహణాధికారి అద్దంకి నాగేశ్వర్ రావు, ఆలయ అర్చకులు పాతర్లపాటి రవీందర్,పాతర్లపాటి శ్రీనివాస్ అయినవోలు మధుకర్ శర్మ నందనం భానుప్రసాద్ శర్మ నందన మధుశర్మ పాతర్లపాటి నరేష్ శర్మ, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.