శ్రీ సంతోషిమాత దేవాలయంలో ఉన్మత్త వారాహి పూజలు
9views సూర్యాపేట సాంస్కృతికం, జులై 03:
ఆషాడమాసంలో విశేషమైన శ్రీవారాహి నవరాత్రి ఉత్సవములలో బాగంగా శ్రీ సంతోషి మాత దేవాలయం గురువారం 8 వ రోజు ఉన్మత్త వారాహి దేవి గా అమ్మవారు పూజలు అందుకున్నది.ఈ సందర్భంగా దేవాలయం అర్చకులు బట్టారం వంశీకృష్ణ శర్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవరాత్రుల్లో విశేషంగా ప్రత్యేకము గా ఎరుపు పుష్పాలతో అర్చనలు నిర్వహించారు. ఉన్మత్త వారాహి దేవి అమ్మవారి విశిష్టత భక్తులకు తెలియజేశారు. పూజల అనంతరం మహిళలు హారతులు ఇస్తూ అమ్మవారికి కీర్తిస్తూ పాటలు పాడారు.
ఈ కార్యక్రమంలో దేవాలయ అద్యక్షులు నూక వెంకటేశ్వం గుప్తా ప్రధాన కార్యదర్శి బ్రాహ్మ0డ్లపల్లి మురళీధర్ , కమిటీ సభ్యులు బజ్జూరి శ్రీనివాసు దేవాలయ మేనేజర్ బచ్చు పురుషోత్తం దేవాలయ క్లర్క్ దులుసోజు జలంధర్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.