ప్రసిద్ధిగాంచిన రుయ్యాడి హుస్సేన్ హుస్సేన్ దేవస్థానాన్ని దర్శించుకున్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్
_ హస్సేన్ హుస్సేన్ ల ఆశీర్వాదంతో కేసీఆర్ ఆరోగ్యం బాగుండాలని మొక్కుకున్న ఎమ్మెల్యే అనిల్ జాధవ్
_ కేసీఆర్ హయంలో అన్ని మతాలకు సమాన అభివృద్ధి
9వ్యూస్, అదిలాబాద్ జిల్లా జులై 06: రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన రుయ్యాడి హస్సేన్ హుస్సేన్ దేవస్థానాన్ని మొహారం పండుగ సందర్భంగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యం హస్సేన్ హుస్సేన్ ఆశీర్వదాలతో బాగుండాలని కోరుకున్నారు. కేసీఆర్ మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని ప్రజలకు నమ్మకం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.