శ్వేతార్కలో తొలి ఏకాదశి పూజలు
9 views డిజిటల్ న్యూస్ కాజీపేట జూలై 06: స్వయంభు శ్రీ శ్వేతార్క మూల గణపతి దేవాలయ దివ్య క్షేత్రంలో నేడు హిందువులు ఎంతగానో ఆదరించే ట్వంటీ తొలి ఏకాదశి పండగని పురస్కరించుకొని దేవాలయంలో కొలువై ఉన్న కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి..
శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ఉత్సవమూర్తులకు మరియు శ్వేతార్క గణపతి స్వామి వారి ఉత్సవ మూర్తులకు విశేష 108 లీటర్ల పాలతో అభిషేకం చేయడం జరిగింది మరియు సామూహికంగా భక్తులచే స్వయంగా స్వామివారికి అభిషేక క్రతువుని నిర్వహించారు. .
అనంతరం మహాలక్ష్మి విష్ణు పారాయణం నిర్వహించి అనంతరం స్వామివారికి ప్రాతక్కాల పూజ పూర్తి చేసుకొని మహా మంగళహారతి భక్తులందరికీ వేద ఆశీర్వచనం మరియు తీర్థ గోష్టి అన్నపూర్ణ భవన్ లో అన్నదానం నిర్వహించడం జరిగింది..
ఈ కార్యక్రమం అయినవోలు సాయి కృష్ణ శర్మ దేవాలయ పరిపాలన నిర్వాహకులు వారి మంత్రోచ్ఛానా నడమ అర్చకులు శివం మరియు హరికృష్ణ స్వామి కార్యకర్తలు భాగ్యలక్ష్మి గౌతం వెంకట సాయి తేజ తదితరులు పాల్గొన్నారు