జనసేన కోర్ కమిటీలతో పార్టీ పటిష్టం
జిల్లా కార్యదర్శి ఉల్లి సీతారాం, మండల అధ్యక్షుడు వంతల బుజ్జిబాబు
చింతపల్లి, (9 Views) జూలై 05 : అల్లూరి జిల్లా పాడేరు నియోజకవర్గంలో జనసేన పార్టీ విస్తరణ, బలోపేతానికి ప్రత్యేక దృష్టి సారించింది. పాడేరు నియోజకవర్గ ఇన్చార్జి వంపూరి గంగులయ్య ఆదేశాల మేరకు, శనివారం చింతపల్లి మండలంలోని బయలు కించంగి గ్రామంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి ఉల్లి సీతారాం, చింతపల్లి మండల అధ్యక్షుడు వంతల బుజ్జిబాబు ఆధ్వర్యంలో పటిష్టమైన కోర్ కమిటీని ఏర్పాటు చేశారు.
ఈ కమిటీ ఏర్పాటు పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేస్తుందని పార్టీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. కోర్ కమిటీ ఏర్పాటు అనంతరం, నాయకులు గ్రామంలోని ప్రజలతో మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ప్రభుత్వ పథకాల అమలు తీరు వంటి అంశాలపై ప్రజల అభిప్రాయాలను సేకరించారు.
ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి ఉల్లి సీతారాం, మండల అధ్యక్షుడు వంతల బుజ్జిబాబు లు మాట్లాడుతూ, పార్టీ బలోపేతం కావాలంటే కోర్ కమిటీల ఏర్పాటు అత్యంత అవసరం అన్నారు. ఈ కోర్ కమిటీలు పార్టీకి మూల స్తంభాలుగా పనిచేస్తాయి అని, క్షేత్రస్థాయిలో ప్రజలకు, పార్టీకి మధ్య వారధులుగా ఉండి, ప్రభుత్వ పథకాలను, జనసేన పార్టీ చేపట్టే మంచి పనులను ప్రజల దృష్టికి తీసుకెళ్లే వారిగా కోర్ కమిటీ పనిచేయాలన్నారు.
ఇదేగాక ఎక్కడ సమస్య ఉంటే అక్కడ జనసేన పార్టీ ప్రజలకు అండగా నిలుస్తుంది. ప్రజల తరఫున పోరాడుతుంది అన్నారు. పార్టీ అధినేత ఉపముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ చేపడుతున్న గొప్ప గొప్ప పనులు, ప్రజా సంక్షేమం కోసం ఆయన నిరంతరం పడుతున్న తపన గురించి క్లుప్తంగా వివరించారూ. యువత, మహిళలు, అన్ని వర్గాల ప్రజలు పార్టీకి అండగా నిలబడితేనే మార్పు సాధ్యం అవుతుంది. అని స్పష్టం చేశారు.
గత కొద్దికాలంగా జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో తన ఉనికిని చాటుకునేందుకు చేపడుతున్న అనేక కార్యక్రమాల్లో భాగంగా ఈ కోర్ కమిటీల ఏర్పాటు జరిగిందనీ భవిష్యత్తులోనూ ఇలాంటి కమిటీల ద్వారా ప్రజలకు మరింత చేరువై, వారి సమస్యలను పరిష్కరించే దిశగా జనసేన పార్టీ ముందుకు సాగుతుందని నాయకులు పేర్కొన్నారు. ఇది పార్టీకి మరింత బలం చేకూరుస్తుందని, రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయానికి ఈ కమిటీలు కీలక పాత్ర పోషిస్తాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కిముడు కృష్ణమూర్తి, పెదబరడ పంచాయితీ, నాయకుడు కూడా రామకృష్ణ, గసాడి దిలీప్, మనోహర్, కొర్ర కృష్ణ, మత్స్యరాజు, రవి, చిరంజీవి, చరణ్, చంటి, బాలు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.