బి.ఆర్.ఎస్ నుండి కాంగ్రెస్ లో భారీ చేరికలు కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే నాయిని

 బి.ఆర్.ఎస్ నుండి కాంగ్రెస్ లో భారీ చేరికలు కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే నాయిని

కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది:ఎమ్మెల్యే


9 views డిజిటల్ న్యూస్ హన్మకొండ జిల్లా జూలై 05: వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 30వ డివిజన్ ప్రెసిడెంట్ రమేష్ మరియు నాయకులు బొంత సారంగం ఆధ్వర్యంలో బి.ఆర్.ఎస్ పార్టీ నుండి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరారు .



 విరిని పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి బాలసంద్రం లోని తన క్యాంపు కార్యాలంలో కండువా కప్పి ఆహ్వానించారు.


ఈ సందర్బంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా పాలన నచ్చి ఆకార్షితులై కాంగ్రేస్ లో చేరుతున్న ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తానని, ఎవరికి ఎలాంటి సమస్య వచ్చిన తనవద్దకు రావాలని ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని అన్నారు. కాంగ్రేస్ పార్టీని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని అన్నారు.


అంతకు ముందు ప్రజా ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి పాలన నచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని బి.ఆర్.ఎస్ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బొంత సారంగం, డివిజన్ అధ్యక్షులు వల్లెపు రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.