ఘనంగా పీర్ల ఊరేగింపు
9వ్యూస్, వేములపల్లి , జులై 05: మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే మొహరం వేడుకల్లో భాగంగా శనివారం మండలంలోని రావులపెంట సల్కనూర్ గ్రామాలలో పీర్లను ఘనంగా ఊరేగించారు
ఈ సందర్భంగా డప్పు చప్పులతో గ్రామాల్లోని పలు వీధుల్లో పీర్లను ఊరేగించగా గ్రామస్తులు వాటికి నీళ్ల ఆరగించి తమ మోక్కులను చెల్లించుకున్నారు.
శనివారం రాత్రి రావులపెంట గ్రామంలో అగ్నిగుండాలు నిర్వహించగా పిర్లను ఎత్తుకొని అగ్నిగుండాల నుంచి వెళ్లారు.
ఈ సందర్భంగా పలువురు భక్తిశ్రద్ధలతో అగ్నిగుండాల నుంచి అటు ఇటు తిరుగుతూ ఆనందోత్సాహంగా గడపగా చివరి రోజు అయిన నేడు పీర్లు బావులకు చేరడంతో వేడుకలు ముగుస్తాయి