కేంద్ర మంత్రి బండి సంజయ్ ని వారి స్వగృహం వద్ద మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ రైల్వే జేఏసీ బృందం

 కేంద్ర మంత్రి బండి సంజయ్ ని వారి స్వగృహం వద్ద మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ రైల్వే జేఏసీ బృందం



9 views డిజిటల్ న్యూస్ జూలై 06 :కేంద్ర మంత్రి ని కలిసిన రైల్వే జేఏసీ పట్టు శాలువతో పుష్పగుచ్చం ఇచ్చి సత్కరించారు. బండి సంజయ్ తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం ఫలుదపాలు ఆయన ని కలిసి తెలంగాణ రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కాజీపేట లోనే నిర్మించాలని సంజయ్ ని అదేవిధంగా అప్పటి కేంద్ర టూరిజం మంత్రి G. కిషన్ రెడ్డి ని కలిసి కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం జరిగితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య 



కొంతమేరకైనా తగ్గుతుందని అప్పటి హనుమకొండ బిజెపి అధ్యక్షురాలు రావు పద్మ ఆధ్వర్యంలో విన్నవించుకున్న సందర్భంగా... మరియు తెలంగాణ రైల్వే జేఏసీ పోరాటాల ఫలితంగా... ఈ పోరాటంలో అనేక రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు, వ్యాపార సంఘాలు ఇలా అనేక సంఘాలతో పోరాడిన పోరాట ఫలితంగా... కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి,అప్పటి రాష్ట్ర ప్రభుత్వం స్థలాన్ని కేటాయించడం ద్వారా 


అప్పటి బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ ఆధ్వర్యంలో G. కిషన్ రెడ్డి ప్రోద్బలంతో తేదీ :08-07-2023 రోజున మన భారతదేశ ప్రధానమంత్రి మోడీ ని హన్మకొండ కు తీసుకువచ్చి శంకుస్థాపన చేయడం జరిగింది! 



ఇప్పుడు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ 80% పనులు పూర్తికావచ్చిన సందర్భంగా... ఏదైతే గతంలో 1983 లో కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ప్రకటన చేసి దానిని 1985లో పంజాబ్ రాష్ట్రం తరలించడం అక్కడ నెలకొల్పబడిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో కేవలం ఉద్యోగాలు అన్ని పంజాబ్ రాష్ట్ర ప్రాంత ప్రజలకు మాత్రమే ఇవ్వడం జరిగింది. 


అదే GO ప్రకారం కాజీపేటలో నెలకొల్పబడుతున్న మల్టీ పర్పస్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో భూములు కోల్పోయిన రైతుల కుటుంబాలలో కొంత శాతం, స్థానిక జిల్లా ప్రజలకు కొంత శాతం, తెలంగాణ రాష్ట్ర ప్రాంత నిరుద్యోగులకు కొంత శాతం మేరకు ఉద్యోగాలు కల్పించాలని! ఔట్సోర్సింగ్ ఉద్యోగులను, తాత్కాలిక ఉద్యోగులను అతి పెద్ద పరిశ్రమ అయిన కాజీపేట మల్టీపర్పస్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు కల్పిస్తే బాధ్యతాయుతంగా పని చేయలేరని కాబట్టి ఈ ప్రాంత ప్రజల అభిమతం మేరకు ఈ ప్రాంత ప్రజలకు కనీసం 68% ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వినతి పత్రంలో పొందుపరచడం జరిగింది.


     అదేవిధంగా సౌత్ సెంట్రల్ రైల్వే లోని 6 డివిజన్లలో విజయవాడ, గుంతకల్, గుంటూరు డివిజన్లో కొత్త జోన్ గా ఏర్పడినటువంటి సౌత్ కోస్ట్ రైల్వేలోకి వెళ్లిపోవడమే కాకుండా... గతంలో వాల్టేర్ డివిజన్ ఎత్తివేసి సౌత్ పోస్ట్ రైల్వే హెడ్ కోటర్ గా ప్రకటన చేసి ఇప్పటి AP లోని అక్కడి ప్రభుత్వం డిమాండ్ మేరకు మళ్లీ విశాఖపట్నం పేరుతో వారికి కొత్త డివిజన్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేస్తూ... అదేవిధంగా ఇప్పుడు సౌత్ సెంట్రల్ రైల్వేలో సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ డివిజన్లు మాత్రమే ఉన్నాయని కనుక గత 30 సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజల అభిమతం కోసం మరి తెలంగాణ రైల్వే జేఏసీ పోరాట స్ఫూర్తిని గౌరవిస్తూ... సౌత్ సెంట్రల్ రైల్వేలో 6 డివిజన్ కలిసి ఉన్నప్పుడే కాజీపేట సబ్ డివిజన్ 42.8% శాతం లాభాలను ఇచ్చిన ఘనత కాజీపేటకు ఉంది కాబట్టి! సికింద్రాబాద్ డివిజన్ ఈ జోన్ బైఫెరికేషన్లో అతి పెద్ద డివిజన్ గా ఏర్పడిన కారణంగా... పరిపాలన విజన్ లో రైల్వే అధికారులకు ఉద్యోగులకు అధిక భారం ఏర్పడుతుంది కాబట్టి కాజీపేట ను మరొక రైల్వే డివిజన్ గా ఏర్పాటు చేయాలని రాబోయే రోజులలో కాజీపేట రైల్వే డివిజన్ గా ఏర్పడితే భారత రైల్వే లోనే ఒక ఐకాన్ గా నిలుస్తుందని కాబట్టి మా వినతి మేరకు భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి దృష్టికి కేంద్ర రైల్వే శాఖ మంత్రివర్యులు అశ్విని వైష్ణవ్ దృష్టికి అదే విధంగా రైల్వే బోర్డ్ చైర్మన్ దృష్టికి ఈ మా కోరికలను మీరు వారి దృష్టికి తీసుకెళ్లి కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటుకు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకు ఉద్యోగాల విషయలు పరిష్కారం చేయాలని వినతి పత్రంలో కోరడం జరిగింది.



      వారు మా వినతిపత్రం మేరకు మా సంభాషణను వినమ్రంగ స్వీకరించి రాదనుకున్న కోచ్ ఫ్యాక్టరీని తీసుకువచ్చి నిర్మాణం చేస్తున్నాం కాబట్టి మనం కొంత ఓపికతో ఈ ప్రాంత అభివృద్ధి కోసం పని చేద్దాం అన్నా... నీ కోరికలను మీరు చెప్పిన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్లి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవి ని కూడా కలిసి సముచితంగా ఉన్న మీ కోరికలను కృషి చేస్తానని సానుకూలంగా స్పందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైల్వే జేఏసీ కన్వీనర్: దేవులపల్లి రాఘవేందర్, చైర్మన్: కొండ నర్సింగారావు, P. రమేష్, నమిండ్ల మనోహర్, కాజీపేట చిరు వ్యాపారులు టోనీ, రాజు, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.