ఏ.యస్.జే. ఆధ్వర్యంలో మొహర్రం షర్బతు పంపిణీ

 ఏ.యస్.జే. ఆధ్వర్యంలో మొహర్రం షర్బతు పంపిణీ


9వ్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జులై 06 : కొత్తగూడెం పట్టణంలోని జామియ మసీద్ లో అహలే సున్నత్వల్ జామాత్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మొహర్రం పదవ రోజు, ఇమామ్ హుస్సైన్ షాహదత్ ను పురస్కరించుకుని షర్బత్ పంపిణీ చేశారు. 




ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు షేక్ కరీం ఖాద్రీ ముఖ్య అతిథిగా పాల్గొన్న కార్యక్రమన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ హక్కుల పరిరక్షణ కోసం కర్బలా మైదానంలో జరిగిన భీకర యుద్ధం లో మహమ్మద్ ప్రవక్త మనమడు హజ్రత్ ఇమాం హుస్సేన్ మరియు వారి సైన్యం 72 మంది వీర మరణం పొందిన రోజు కావున వారి త్యాగాలను ను స్మరించుకుంటు ఈ కార్యక్రమం నిర్వహించినట్టు తెలిపారు. 



అనంతరం మౌలానా నయ్యర్ ఆషురా నమాజ్ తో పాటు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అహలే సున్నత్వల్ జామాత్ కమిటీ జిల్లా అధ్యక్షులు షేక్ కరీం ఖాద్రీ, ఉపాధ్యక్షులు మహమ్మద్ గౌస్ మోహినుద్దీన్, ప్రథాన కార్యదర్శి షేక్ యఖుబ్ ఖాద్రీ, కోశాధికారి సయ్యద్ యఖుబ్ ఉద్దీన్, వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ హుస్సేన్ ఖాన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ మహమ్మద్ షమీ, మహమ్మద్ షఫీ, ఇమామ్ సాహెబ్ నయ్యర్ మౌలానా, సెక్రటరీ జనరల్స్ మహబూబ్ ఖాద్రీ, అలీం ఉద్దీన్, జిల్లా కమిటీ సభ్యులు మదీన అక్తర్, మహమ్మద్ ఖాజా ఖాన్, ఆసిఫ్, షమ్షు, నీసార్, సలీం, మహమ్మద్ నయిం చిష్తీ, తదితరులు పాల్గొన్నారు.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.