టీఎస్ జెఏ ద్వితీయ మహాసభ పోస్టర్లను ఆవిష్కరణ చేసిన _రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి

టీఎస్ జెఏ ద్వితీయ మహాసభ పోస్టర్లను ఆవిష్కరణ చేసిన _రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి


9views, సూర్యాపేట జిల్లా (మోతే) జులై 05: జూలై నెల 21వ తేదీన హైదరాబాద్ మహానగరంలో నిర్వహించబోయే తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ ద్వితీయ మహాసభను అసోసియేషన్ నాయకులు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వర్కింగ్ జర్నలిస్టులందరూ అత్యధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి పిలుపునిచ్చారు.



 శుక్రవారం సూర్యాపేట జిల్లా మోతే మండలానికి సంబంధించిన ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన సమావేశంలో మహాసభకు సంబంధించిన పోస్టర్లను లను ఆవిష్కరించి మాట్లాడారు.


ఈ కార్యక్రమానికి జర్నలిస్టులు అసోసియేషన్లకు యూనియన్లకు అతీతంగా ప్రత్యేకంగా నిర్వహించబోయే హలో జర్నలిస్టు చలో హైదరాబాద్ వేదిక లో పాల్గొనడానికి తరలిరావాలని తెలిపారు.


రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించేంతవరకు ఉద్యమాలు చేస్తూనే ఉంటామన్నారు.


ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గట్టిగుండ్ల రాము సూర్యాపేట నియోజకవర్గ నాయకులు యాతాకుల మధుసూదన్ మోతే మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఏర్పుల సాయి కృష్ణ కోశాధికారి గురజాల వెంకన్న తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.